తూర్పు రాయలసీమ నియోజక వర్గ ఎమ్మెల్సీ ఎన్నికలలో వైఎస్సార్సీపీ గ్రాడ్యుయేట్ అభ్యర్థి పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మండల సచివాలయ జెసీఎస్ కన్వినర్ యాడిక శ్రీనివాస రెడ్డి కోరారు. మండలంలోని శివరామపురంలో సోమవారం వైఎస్సార్సీపీ నాయకుడు హనుమంతరావుతో కలసి గ్రామంలో గ్రాడ్యుయేట్ ఓటర్లను కలసి ఓట్లు అభ్యర్థించారు. ముందుగా దర్శిలో వైఎస్సార్ సీపీ నాయకులు మద్దిశెట్టి రవీంద్ర, డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్ తో కలసి గ్రాడ్యుయేట్ అభ్యర్థుల గెలుపునకు తీసుకుంటున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు. జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, సర్పంచిలు పీఎస్ శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

