పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్య ర్థులుగా వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేస్తున్న పేర్నాటి శ్యామ్ ప్రసాదొడ్డి, చంద్రశేఖరరెడ్డిల విజయానికి ప్రతి కార్యకర్త శక్తి వంచన లేకుండా కృ షి చేయాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డిలు వైఎస్సార్ సీపీ కార్యకర్తలను కోరారు. స్థానిక పొదిలి రోడ్డులోని సమావేశం హాలులో నియోజకవర్గ కార్యకర్తల సమావేశం సోమవారం జరిగింది. ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రచార కరపత్రాలు వారు ఆవిష్కరించారు. వెంకాయమ్మ, శివప్రసాద్ డ్డిలు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనం తరం మోటుపల్లిలో రోడ్డు ప్రమాదంలో గాయ పడిన వైఎస్సార్ సీపీ నాయకుడు గోను వెంగళరెడ్డి ని, అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటే శ్వరరెడ్డిని పరామర్శించారు. కార్యక్రమంలో ఎం పీపీ గోళ్లపాటి సుధాఅచ్చయ్య, దొనకొండ, ముండ్ల మూరు మండల పార్టీ కన్వీనర్లు కాకర్ల కృష్ణారెడ్డి, సూదిదేవర అంజయ్య, మాజీ ఎంపీపీ ఇత్తడి దేవ దానం, కురిచేడు జెడ్పీటీసీ నుసుం నాగిరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు.


