మహిళలకు చట్టాలలో సమాన హక్కులు ఉన్నాయని సీనియర్ సివిల్ జడ్జి జి ఎల్ వి. ప్రసాద్ తెలిపారు. స్థానిక ఎస్సికాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి జి ఎల్ వి ప్రసాద్ మాట్లాడుతూ… మహిళలు అన్ని రంగాలలో రాణించాలన్నారు. తమ హక్కులు, విధులు, బాధ్యతలు గురించి తెలుసు కోవాలన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు మనోరమ్మ, సురేష్, సంఘసేవకులు జీవిరత్నం, మాజీ సర్పంచి జిసి. గురవయ్య, ప్రేమ్ కుమార్, పాల్గొన్నారు.
j