మహాలక్ష్మీ జయంతి మహోత్సవం,  అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ముఖ్య అతిధిగా మాజీమంత్రి శిద్దా రాఘవరావుసతీమణి లక్ష్మీ పద్మావతి

తెనాలి రామకృష్ణ కవి కళా క్షేత్రంలో శ్రీ సాలి గ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన శ్రీ మహాలక్ష్మీ జయంతి మహోత్సవం మరియు  అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ముఖ్య అతిధిగా మాజీమంత్రి శిద్దా రాఘవరావు సతీమణి,ఆర్యవైశ్య మహిళా సంఘ్ అధ్యక్షురాలు శ్రీమతి శిద్దా లక్ష్మీ పద్మావతి పాల్గొన్నారు. రాష్ట్ర
తెనాలి సాలిగ్రామ మఠం ట్రస్ట్ ఫౌండర్ శ్రీశ్రీశ్రీ పరమ పూజ్య ప్రజ్ఞానంద సరస్వతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రముఖ ఆధ్యాత్మికప్రవచుకురాలు
డా.ఎన్.అనంత లక్ష్మీ, ప్రముఖ ఆధ్యాత్మిక గాయకులు శ్రీమతి కొండవీటి జ్యోతిర్మయి,ట్రస్ట్ చైర్మన్ నంబురు వెంకట కృష్ణ మూర్తి ,మణిద్వీప వర్ణన రచయిత శ్రీమాన్ శివ కవి,పరమ పూజ్య శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి గారితో కలసి జ్యోతి ప్రజ్వలన నిర్వహించారు.
అనంతరం శిద్దా లక్ష్మీ పద్మావతి శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆహూతులు,భక్తుల సమక్షంలో సామూహిక మణి ద్వీప వర్ణన గళార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు.వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన మాతృ మూర్తులకు వేద ఆశీర్వాద సన్మాన కార్యక్రమంలో భాగంగా శ్రీమతి శిద్దా లక్ష్మీ పద్మావతి కు ట్రస్ట్ సభ్యులు శాలువాతో సత్కరించారు.
కార్యక్రమంలో ట్రస్ట్ కార్యదర్శి ఉప్పల నాగేశ్వరరావు, శ్రీ విద్యా పీఠం,శ్రీ జయలక్ష్మి మాతృ మండలి,సాలి గ్రామ మఠం ట్రస్ట్ ప్రతినిధులు దివ్వెల వెంకట శ్రీనివాసరావు, గుడివాడ శివ ప్రసాద్, యక్కల మాల్యాద్రి, పుష్పాల నాగేశ్వరరావు, పల్లపోతు మురళి మోహన్,పల్లపోతు పద్మ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *