మహిళా పక్షపాతి ముఖ్యమంత్రి వైయస్ జగనన్న
-55 శాతానికిపైగా మహిళలకు పదవులు
-90 శాతానికి పైగా పథకాలు
మహిళల పేరుమీదే

వైనాట్ 175 అనేదే మనందరి ముందున్న లక్ష్యం
జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పేర్కొన్నారు. స్థానిక వైఎస్సార్సీపీ జిల్లా కార్యాల: యంలో బుధవారం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్య క్షురాలు తమ్మినేని మాదవి నేతృత్వంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్సీ పోతుల సునీత, బాలినేని సతీమణి శచీదేవి, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ సింగరాజు మీనా కుమారి, నగర మేయర్ గంగాడ సుజాతతోపాటు పలువురు మహిళా నాయకురాళ్లు పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ – బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన నవరత్నాల హామీలను నెరవే ర్చడమే కాకుండా స్థానిక సంస్థల్లో సైతం 50 శాతానికి పైగా పదవులను మహిళలకు కేటాయించిన ఘనత మన ముఖ్యమంత్రిదన్నారు. 90 శాతానికి పైగా ప్రభుత్వ పథకాలు మహిళల పేరుమీదనే ఇస్తున్నారని, దేశచరిత్రలో మహిళలకు దక్కిన అత్యంత అరుదైన గౌరవం అన్నారు. టీడీపీలో ఉన్న మహిళా నాయకు రాళ్లు జగన్మోహన్ రెడ్డిని దూషిస్తున్న తీరు వారి దుర్మార్గపు నైజానికి నిదర్శనమని, ఏది ఏమైనా 2024 ఎన్నికల్లో వైనాట్ 175 మన లక్ష్యమని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. పాట రూపంలో మహిళల ఖ్యాతిని గురించి వివరించారు.
ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ ప్రతిష్ట క్షంలో ఉన్న జగన్మోహన్రెడ్డికి నాడు వెన్నుదన్నుగా మహిళలు నిలిచారని, అందుకే నేడు ఆయన ప్రవేశ పెట్టే పథకాలన్నీ మహిళల పేరుమీదనే కొనసాగిస్తు న్నారన్నారు. చట్టసభల్లో మహిళలకు 55 శాతం సీట్లు కేటాయించిన ఏకైక చరిత్ర జగన్మోహన్ రెడ్డిదని, మహిళా పక్షపాతిగా నిలిచారన్నారు. చట్టసభల్లో 33 శాతం సీట్లు కేటాయించాలంటూ దశాబ్దాలుగా మహిళలు గొంతెత్తి అరుస్తున్నా అందుకు అవకాశం దక్కడంలేదని, కానీ మన రాష్ట్రంలో మాత్రం 55 శాతం సీట్లు కేటాయించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి అక్క చెల్లెమ్మలకు ఎంత అండగా ఉంటున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. నాడు పూలే, అంబేద్కర్ లు మహిళలు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షిస్తే నేడు వారి ఆలోచనలు స్పూర్తిగా తీసుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినవ పూలే, అంబేద్కర్
గాపాలన సాగిస్తున్నారన్నారు. కేవలం చట్టసభల్లోనే కాకుండా స్థానిక సంస్థల్లో సైతం మహిళలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారని, అందుకు నిదర్శనమే జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఓడా చైర్పర్సన్ సింగరాజు మీనా కుమార్ అన్నారు. బీసీ మహిళనైన తనకు మూడోమారు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తున్న జగన్మోహన్ రెడ్డికి అండగా ఆయన ఆశయం అయిన చైనాట్ 175ను సాధించేందుకు కృషిచేస్తానన్నారు.
ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి శచీదేవి మాట్లాడుతూ… పాలనలో మహిళలకు అత్యధిక భాగస్వామ్యం కల్పించిన జగన్మోహన్ రెడ్డి కి, జిల్లాలో అందుకు కృషిచేస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డికి అండగా ఉంటున్న ప్రతి మహిళకు ధన్యవాదాలు తెలి పారు. ఒడా చైర్పర్సన్ సింగరాజు మీనాకుమారి, నగర మేయర్ గంగాఢ సుజాత మాట్లాడుతూ…. అన్న సైన్యం అంటే మహిళలే అని, ఆ మహిళలే 2024 ఎన్ని కల్లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని, రాష్ట్ర మంత్రిగా బాలినేని శ్రీనివాసరెడ్డి అయ్యేవరకు అలుపెరగని కృషిచేస్తామన్నారు. కార్యక్రమంలో బాలినేని సోదరి సుంకర రవణమ్మ, ఏపీ టైలర్స్ వెల్ఫేర్ బోర్డు చైర్పర్సన్ షేక్ సుభాని, మేదర కార్పొరేషన్ చైర్పర్సన్ కేతా లలిత నాంచారమ్మ, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జోనల్ ఇన్చార్జి బడుగు ఇందిర, వైఎస్సార్ సీపీ నాయకురాళ్లు బైరెడ్డి అరుణ, కావూరి సుశీల, ఏపీ సీపీడీసీఎల్ డైరెక్టర్ జిల్లెల్లమూడి రమాదేవి, జెడ్పీటీసి లు, ఎంపీపీలు స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ఉత్సాహంగా మ్యూజికల్ చైర్స్…
ముందుగా పార్టీ కార్యాలయంలోని వైఎస్సార్ విగ్ర హానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మ్యూజికల్ చైర్స్ పోటీలు నిర్వహించారు. దాదాపు 20 మందికిపైగా మహిళా నాయకురాళ్లు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. జెడ్పీ చైర్పర్సన్ వెంకాయమ్మ. బాలినేని సతీమణి శచీదేవి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *