వ్వవసాయశాఖ ద్వారా అమలు చేస్తున్న ప్రతిపథకాన్ని రైతులకు అర్హతను బట్టి ఉపయోగించుకునేలా సలహా మండలి సభ్యులు, విఏ ఏలు తెలియజేయ్యాలని వ్యవసాయాధికారి ప్రసాదరావు కోరారు. రైతు భరోసా కేంద్రంలో శుక్రవారం మండల స్థాయి వ్యవసాయ సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. రైతు భరోసా కేంద్రాలకు, రైతులకు సలహా మండల సభ్యులు అనుసంధాన కర్తలుగా ఉండి రైతులకు ఉపయోగపడాలని సూచించారు. వేసవిలో సాగు చెయ్యాల్సిన పంటల గురించి గ్రామ వ్యవసాయ అసిస్టెంట్స్ (విఏఏ)లు రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. ఎఈఓలు నాగరాజు, రాజసుందరి, ప్రకృతి సాగు ఇన్చార్జి నరసింహులు తదితరులు పాల్గొన్నారు
మండల స్థాయి వ్యవసాయ సలహా కమిటీ సమావేశం నిర్వహణ ..
10
Mar