గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఫ్యామిలీ ఫిజీషియన్ 104 ద్వారా వైద్య సేవలు అందించడం జరుగుతుందని వైద్యాధికారి బి మధు శంకర్ అన్నారు. మండలంలోని మారెళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల నాయుడుపాలెం గ్రామంలో గల డాక్టర్ వైయస్సార్ హెల్త్ క్లినిక్ నందు శుక్రవారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మధు శంకర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల లోని పేద ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నవారిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం గ్రామాలకే వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఈ శిబిరంలో 74 రకాల మందులు12 రకాల టెస్టులు,నిర్వహించి మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఈ శిబిరాలకు వచ్చి వైద్య సేవలు పొందాలన్నారు. ఈ శిబిరంలో 60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ ఎస్ కే యం యం సుభాని, సి హెచ్ ఓ రత్నకుమారి,104 డీఈవో వెంకట ప్రసాద్, ఏఎన్ఎం శిరీష, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.
ఫ్యామిలీ ఫిజీషియన్ ద్వారా వైద్య సేవలు
10
Mar