వైయస్సార్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. దర్శి నియోజకవర్గంలో ముండ్లమూరు, ఉమామహేశ్వరపురం, పూరిమెట్ల, ఈదర రమణారెడ్డిపాలెం గ్రామాల్లో శనివారం ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 13న జరగ నున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ బలపరి చిన అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ నమూనా బ్యాలెట్ పత్రాలు ఓటర్లకు అందజేశారు. పట్టభ ద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యామ్ ప్రసాదరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి చంద్రశేఖరరెడ్డిలకు మొదటి ప్రాధాన్యం ఓటు వేసి గెలిపించాలన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేసి ఓటర్లను చైతన్యం చేయాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్య దర్శి సుంకర బ్రహ్మారెడ్డి, ముళ్ళమూరు సొసైటీ అధ్యక్షులు అంబటి వెంకటేశ్వర రెడ్డి,, తాతపూడి ఏసుదాసు, మండల సచివాలయాల కన్వీనర్ మేడికొండ జయంతి, వైఎస్సార్ సీపీ నాయకులు పాలెపోగు డగ్లస్, తాతపూడి శాంతకు మార్, సాల్మన్ పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *