వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థులు శ్యాం ప్రసాద్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి లను అత్యధిక మెజార్టీతో గెలిపిం చాలని కోరుతూ దర్శి పట్టణంలో వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి ,వార్డు కౌన్సిలర్లు మేడగం మోహన్ రెడ్డి, వీసీ రెడ్డి, జగన్నాథం మోహన్ బాబు, తాళ్లూరి బాబూరావు, ఆవుల శివారెడ్డి, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ వెన్నపూస వెంకట రెడ్డి, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డిలు శనివారం ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు విశేష స్పందన లభిస్తోందని చెప్పారు. ప్రచారం చేసిన వారిలో సొసైటీ అధ్యక్షుడు వేమిరెడ్డి చెన్నారెడ్డి, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు గాలిమూటి దేవప్రసాద్, ఎంపీటీసీల సంఘ జిల్లా అధ్యక్షుడు బండి గోపాల్, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, మాజీ సర్పంచ్ వెన్నపూస శేషిరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు గంజి వెంకటేశ్వరరెడ్డి, రహంతుల్లా, శ్రీనివాసరెడ్డి తడిటరులువ పాల్గొన్నారు.
