రబీ సీజన్లో పండించిన ధాన్యం పంటను ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు చేయడం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి బి. ప్రసాదరావు తెలిపారు. క్షేత్ర పర్యటన సందర్భంగా శనివారం ఆయన శివరాంపురం గ్రామంలో పర్యటించి వరి కల్లాలలోని ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల నుద్దేశించి మాట్లాడుతూ… రైతు భరోసా కేంద్రాలు, సొసైటీల ద్వారా ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధరకే రబీ కాలంలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని చెప్పారు. దీనికంటే అధిక రేట్లకు బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసినట్లయితే రైతులు అమ్ముకోవచ్చని అన్నారు. నాణ్యత ప్రమాణాలను బట్టి ఆర్బికేల ద్వారా గిట్టుబాటు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు 788.68 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మద్దతు ధరకే రబీ ధాన్యం కొనుగోలు – ధాన్యాన్ని పరిశీలించి అవగాహన కల్పించిన వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు
12
Mar