దర్శి పట్టణంలో మత్తు పదార్థాలపై అవగాహన
కార్యక్రమం నిర్వహణ

దర్శి పట్టణంలోని గౌతమి గ్రామర్ స్కూల్, గీతాంజలి జూనియర్ కాలేజీలో డ్రగ్స్ మత్తుపదార్థాలపై జిల్లా ఎస్పీ, మలికాగర్గ్ ప్రతిష్ఠాత్మకంగా జిల్లాలో చేపడుతున్న ‘సంకల్పం ‘అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అయో విద్యాసంస్థలలో ఎస్సై రామకృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ యువత విద్యార్థులు డ్రగ్స్ కు, మత్తుపదార్ధాలకు దూరంగా ఉండాలని విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, విద్యార్థి దశలోనే క్రమశిక్షణ మంచి ఆలోచనలు మంచి అలవాటులతోనే అత్యున్నత శిఖరాలకు చేరుకుంటారని చెడు వ్యసనాల వల్ల విలువైన జీవితాన్ని నాశనం చేసుకోకూడదని చెప్పారు. విద్యార్థులు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. అదే విధంగా విద్యార్థులకు కరపత్రాలు పంచి వారికి డ్రగ్స్ పైన క్విజ్ పెట్టి వారికి డ్రగ్స్ నిర్మూలన పైన అవగాహ కలిగించారు. ఆయా కళాశాలలు, పాఠశాలల ప్రిన్సిపాల్ రామారావు, మహిళా పోలీసులు, గౌతమి గ్రామర్ స్కూల్, గీతాంజలి జూనియర్ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *