వేదా ఫార్మసీ కళాశాలలో క్యాంపస్ సెలక్షన్ –
30 మందికి ఉద్యోగాలు

ముండ్లమూరు మండలంలోని పోలవరం క్రాస్ రోడ్డు వద్ద గల వేదా ఫార్మసీ కళాశాలలో శనివారం నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్ కు 150 మంది విద్యార్థులు ఇంటర్వ్యూలకు హాజరైనారు. ఈ క్యాంపస్ సెలక్షన్ వేదా ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ మరియు డైరెక్టర్ ఎం ఎస్ సుధాకర్ బాబు అధ్యక్షతన జరిగినది. ఈ క్యాంపస్ సెలక్షన్ కు మేడి అసిస్ట్ ఇండియా,( బెంగళూరు)టి పి ఏ ప్రైవేట్ లిమిటెడ్, కివిస్ జనరిక్ ప్రైవేట్ లిమిటెడ్( మేదరమెట్ల) సంస్థల వారి ఆధ్వర్యంలో సెలక్షన్ నిర్వహించారు. ఈ సెలక్షన్లో 30 మంది ఉద్యోగాలు సాధించినట్లు చెప్పారు. ఇందులో 20 మంది కివిస్ జనరిక్, పదిమంది మెడి అసిస్టుకు ఎంపికైనట్లు అని తెలిపారు. ఈ సందర్భంగా సుధాకర్ బాబు మాట్లాడుతూ ఉద్యోగాలు సాధించిన వారు భవిష్యత్తులో ఉన్నత స్థితికి చేరాలని ఆకాంక్షించారు. అనంతరం 30 మందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *