నాగంబొట్ల పాలెంలో బొద్దికూరపాడు అమెరికన్ స్కూల్ ఆధ్వర్యంలో ఆదివారం విద్యా అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజలకు పలు నాటకాల ద్వారా విద్యా అవశ్యకతను వివరించారు. అక్షరాస్యతను పెంచటానికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని వక్తలు అన్నారు. కార్యక్రమంలో సర్పంచి చిమటా సుబ్బారావు, పాఠశాల వ్యవస్థాపకులు, చైర్మన్లు పులి వెంకటేశ్వర రెడ్డి, పులి శిరీషా, ప్రధానోపాధ్యాయుడు రవికుమార్, వైస్ ప్రిన్సిపాల్ నాగరాజు, పాఠశాల ఇన్ఛార్జి రవికుమార్ తదితరులు
పాల్గొన్నారు.



