ప్రభుత్వం ప్రైవేటు పాఠశాల నిర్వహణ విషయంలో ఎంత కఠిన నిర్ణయం తీసుకుంటున్నా సరే ..కొందరు ప్రభుత్వ పాఠశాల నిర్వాహకులు యదేచ్చగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల రోజు సోమవారం ప్రభుత్వ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలకు సెలవు ఇచ్చి ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల కమిషనర్ ఉత్తర్వుల మేరకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది అయితే ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం తూర్పు గంగవరం పరిధిలోని శారద హై స్కూల్ మాత్రం యదేచ్చగా నిర్వహించారు. జిల్లాలో.., మండలం లలో..అన్ని పాఠశాలకు సెలవు ఇవ్వగా ఇలా కొందరు మాత్రం నిబంధన ఉల్లంగించడంపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా కలెక్టర్ , జిల్లా విద్యాశాఖ అధికారి స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజల కోరుతున్నారు.
