ఎమ్మెల్సీ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా ముగిసాయి. తాళ్లూరులో వికే ఉన్నత పాఠశాలలో గ్రాడ్యుయేట్స్ కు, ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకోవానికి రెండు పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసారు. గ్రాడ్యుయేట్ 794 మందికి గాను 645 మంది 81.23శాతం, ఉపాధ్యాయులు 58 మందికి గాను 57 మంది 98.28 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ పోలింగ్ బూతు సందర్శించి నాయకులను తగిన సూచనలు చేసారు. వైఎస్సార్సీపీ తాళ్లూరు మండల ఇంచార్జ్ మద్దిశెట్టి రవీంద్ర, ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మార్గం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీలు ఐ. వెంకటేశ్వర రెడ్డి, ఎంఎన్‌పీ నాగార్జున రెడ్డి, జెసీఎస్ కన్వీనర్ యాడిక శ్రీనివాస రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచిలు, ఎంపీటీసీలు, సొసైటీ అధ్యక్షుడు ఓట్ల తీరును పరిశీలించి ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే సూచనలు మేరకు ఓటింగ్ శాతం పెరిగేలా కృషి చేసారు. దర్శి డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డి, సీఐ రామకోటయ్యలు పోలింగ్ విధానాన్ని పరిశీలించారు.ఎస్సై ప్రేమ్ కుమార్ పటిష్ట బందో బస్తు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు నూకసాని బాలాజీ తాళ్లూరులో పోలింగ్ సరళిని పరిశీలించారు. సీనియర్ పట్టభద్రదారులు. చంటి పిల్లలను వేసుకుని మహిళలు కూడ ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.











