దర్శి నియోజక వర్గంలో సోమవారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించారు. దర్శి డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డి, సీఐ రామకోటయ్యలు నియోజక వర్గంలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి పలు సూచనలు చేసారు. నియోజక వర్గంలో ఏర్పాటు చేసిన 8 గ్రాట్యుయేట్ పోలింగ కేంద్రాలలో, ఐదు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కేంద్రాలలో పటిష్ట బదోబస్తు ఏర్పాటుతో ప్రశాంతంగా ముగిసాయి. గ్రాడ్యుయేట్ పోలింగ్ కేంద్రాలలో బ్యాలెట్ పేపర్ పెద్దదిగా ఉండటంతో పోలింగ్ మందకొడిగా సాగినది. ఊహించని రీతిలో ఓటర్లు ఓటు వేసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ఆయా పోలింగ్ కేంద్రాలను సందర్శించి నాయకులకు, కార్యకర్తలకు తగిన సూచనలు చేసి పోలింగ్ శాతం పెరిగేలా తగిన కృషి చేసారు.
దర్శి నియోజక వర్గంలో ఎమ్మెల్సీ పోలింగ్ శాతం వివరాలు …..
దర్శి నియోజక వర్గంలో పట్టభద్రలు, ఉపాధ్యాయులు ఓట్లు అన్ని కలిపి మొత్తం 7297 ఉండగా అందులో 5593 మంది 76.64శాతము మంది ఓటింగ్ లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రాడ్యుయేట్స్, టీచర్స్ సంబంధించి వేరు వేరుగా పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి..
పట్టభద్రుల సమాచారం…
1) నియోజకవర్గంలోని మొత్తం పట్టభద్రుల ఓటర్ల సంఖ్య – 6875
2) ఓటు హక్కును వినియోగించుకున్న వారి సంఖ్య – 5196
3) ఓటు హక్కును వినియోగించుకొనని వారి సంఖ్య – 1679
4) పట్టభద్రుల ఎన్నికల మొత్తం పోలింగ్ శాతం – 75.57 %
దర్శి మండలం…
మొత్తం ఓటర్లు – 3043
పోల్ అయినవి – 2212
పోల్ కానివి – 831
పోలింగ్ శాతం – 72.69%
దొనకొండ మండలం…
మొత్తం ఓటర్లు – 959
పోల్ అయినవి – 749
పోల్ కానివి – 210
పోలింగ్ శాతం – 78.10%
కురిచేడు మండలం…
మొత్తం ఓటర్లు – 813
పోల్ అయినవి – 669
పోల్ కానివి – 144
పోలింగ్ శాతం – 82.28%
తాళ్లూరు మండలం…
మొత్తం ఓటర్లు – 794
పోల్ అయినవి – 645
పోల్ కానివి – 149
పోలింగ్ శాతం – 81.23%
ముండ్లమూరు మండలం…
మొత్తం ఓటర్లు – 1266
పోల్ అయినవి – 921
పోల్ కానివి – 345
పోలింగ్ శాతం – 72.74%
ఉపాధ్యాయుల సమాచారం…
1) నియోజకవర్గంలోని మొత్తం ఉపాధ్యాయ ఓటర్ల సంఖ్య – 422
2) ఓటు హక్కును వినియోగించుకున్న వారి సంఖ్య – 397
3) ఓటు హక్కును వినియోగించుకొనని వారి సంఖ్య – 25
4) పట్టభద్రుల ఎన్నికల మొత్తం పోలింగ్ శాతం – 94.07%
దర్శి మండలం…
మొత్తం ఓటర్లు – 256
పోల్ అయినవి – 236
పోల్ కానివి – 20
పోలింగ్ శాతం – 92.18%
దొనకొండ మండలం…
మొత్తం ఓటర్లు – 24
పోల్ అయినవి – 22
పోల్ కానివి – 2
పోలింగ్ శాతం – 91.66%
కురిచేడు మండలం…
మొత్తం ఓటర్లు – 46
పోల్ అయినవి – 45
పోల్ కానివి – 1
పోలింగ్ శాతం – 97.82%
తాళ్లూరు మండలం…
మొత్తం ఓటర్లు – 58
పోల్ అయినవి – 57
పోల్ కానివి – 1
పోలింగ్ శాతం – 98.27%
ముండ్లమూరు మండలం…
మొత్తం ఓటర్లు – 38
పోల్ అయినవి – 37
పోల్ కానివి – 1
పోలింగ్ శాతం – 97.36%
ఉపాధ్యాయులు, పట్టభద్రులు కలిపి మొత్తం ఓటర్ల సంఖ్య – 7297
ఓటు హక్కును వినియోగించుకున్న మొత్తం ఓటర్ల సంఖ్య – 5593
ఓటు హక్కును వినియోగించుకొనని మొత్తం ఓటర్ల సంఖ్య – 1704
మొత్తం పోలింగ్ శాతం – 76.64%






