ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు – 73.36% ఓటింగ్ నమోదు- ఉదయం 11 గంటలకే బారులు తీరిన ఓటర్ల – ఓటింగ్ సరళిని పరిశీలించిన ఎమ్మెల్యే

ముండ్లమూరు( ఎమ్మెల్సీ ఎన్నికలు మండల కేంద్రమైన ముండ్లమూరులో సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. ఎలాంటి వివాదాలకు చోటు లేకుండా తహసిల్దార్ ఎస్ ఉషారాణి, ఎస్ఐ ఎల్ సంపత్ కుమార్ ముందస్తుచర్యలు తీసుకొని నిర్వహించారు. సోమవారం పోలింగ్ సందర్భంగా దర్శి డిఎస్పి వి నారాయణస్వామి రెడ్డి, దర్శి సీఐ జే రామకోటయ్య పోలింగ్ బూతులను పరిశీలించి క్యూలో ఉన్న ఓటర్ల గుర్తింపు కార్డులను పరిశీలించారు. మొత్తం 1304 మంది ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు కలిగి ఉండగా వారిలో 958 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పట్టభద్రుల ఓట్లు1266 గాను921మంది ఓట్లు వేశారు. 38 మంది ఉపాధ్యాయుల కు గాను37 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం మందకోడిగపోలింగ్ ప్రారంభమైనప్పటికీ మధ్యాహ్నానికి ఓటర్లు ఎక్కువమంది పోలింగ్ కేంద్రానికి చేరుకొని బారులు తీరారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్ది శెట్టి వేణుగోపాల్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించి, ఓటింగ్ సరళినీ నాయకులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి వివాదాలకు గొడవలకు తావు లేకుండా ఎన్నికలు సజావుగా జరిగేందుకు పోలీసు అధికారులు సహకరించాలని పలు సూచనలు చేశారు. ముందుగా ఎన్నికల పోలింగ్ కేంద్ర ఆవరణలోకి అంద ఉపాధ్యాయుడైన నరసింహారావును పోలీస్ సిబ్బంది పోలింగ్ బూత్ వద్దకు తీసుకువెళ్లారు. బూతులు వారీగా 55వ బూత్ లో 656 కు గాను474 ఓట్లు నమోదయాయని,55 ఏ బూతులు610 ఓటుకు గాను447 ఓట్లు వేశారని,పట్టభద్రుల ఓట్లు921 ఓట్లు వేశారన్నారు. 31వ బూతు లో 38 ఓట్లకు గాను 37 ఉపాధ్యాయుల ఓట్లు వేశారని తెలిపారు. పోలింగ్ శాతం 73.46% శాతం ఓట్లు నమోదు అయ్యాయని తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *