దర్శి పట్టణంలోని చిరువ్యాపారులు వ్యాపారం చేసుకునేందుకు మార్కెట్ ఏర్పాటు చేయాలనే ఉద్దే శంతో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పట్టణంలో పలు స్థలాలను బుధవారం పరిశీలించారు. పొదిలి రోడ్డు పిల్ల కాలువపై నుంచి భాష్యం స్కూల్ వరకు, కురిచేడు రోడ్డు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద స్థలాలు పరిశీలిం చారు. ఈ సందర్భం
ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ ….ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించేందుకు స్థల పరిశీలన చేస్తున్నట్లు తెలిపారు. పట్టణంలో చిరు వ్యాపారులు రోడ్లపై వ్యాపారాలు చేసే వారి ఇబ్బందులను అధిగమించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. వారికి ఒక ప్రత్యేక మార్కెట్ ఏర్పాటు చేస్తే వినియోగదారు లకు కూడా సౌకర్యవంతంగా ఉంటుందని మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. ఎవరికీ ఇబ్బందులు లేకుండా అందరితో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి పేర్కొన్నారు. వైఎస్ఆర్సిపి నాయకుడు డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్, దర్శి మార్కెట్ కమిటీ చైర్మన్ వై వి సుబ్బయ్య , ఎంపీపీ సుధాఅ చ్చయ్య, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, కౌన్సిలర్ వీసీ రెడ్డి, తాళ్లూరు ఎంపీపీ, జెడ్పీటీసీలు శ్రీనివాసరావు, మారం వెంకా రెడ్డి, ఎర్రయ్య విష్ణు తదితరులు పాల్గొన్నారు.


