పొట్టి శ్రీరాములు త్యాగం భావితరాలకు ఆదర్శం

రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి అయిన మహా పురుషుడు, సత్యము, అహింసా, హరిజనోద్ధరణ, అనే ఆశయాల కొరకు జీవితాంతం కృషి చేసిన మహానుయుడు పొట్టి శ్రీరాములు అని చెప్పారు. ముండ్లమూరు ఎస్సై ఎల్ సంపత్ కుమార్ మాట్లాడుతూ ….. మద్రాసు ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రం నుండి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం రావాలని నిరంతరం నిర్విరామంగా, 56 రోజులు ఆమరణ నిరాహార దీక్ష వహించిన ధన్యజీవి, పూర్ణ పురుషుడు, అమరజీవి పొట్టి శ్రీరాములు అని అన్నారు.1901 మార్చి 16న మద్రాసు, జార్జ్ టౌన్, అన్నా పిళ్ళై వీధిలోని165 నంబర్ ఇంటిలో గురవయ్య మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారని వీరి పూర్వికుల స్వస్థలం కనిగిరి తాలూకా పడమటి పల్లె ప్రకాశం జిల్లాలో,20 ఏళ్ల వయసు వరకు పొట్టి శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాస్ లోనే జరిగిందన్నారు. కెల్లంపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోగుల కోటేశ్వరరావు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు రాష్ట్రంలోనే గొప్ప వ్యక్తి అని, ఎంతో పట్టుదల, పోరాట పటిమ కలిగిన యోధుడని కొరియాడారు. ఏదైనా పని చేయాలంటే దాన్ని సాధించేవరకు పోరాటం చేసే వ్యక్తి అని అన్నారు. షేక్ హజరత్ ఆలీ, జి భావన్నారాయణ, నరసింహారావు, మేదరమెట్ల శ్రీనివాసరావు, జె జ్యోతి, చక్రపాణి, బాబురావు, విజయనిర్మల, భారతి, శ్రీదేవి , ఎన్ ప్రభావతి, కొంజేటి సురేష్ బాబు, పాలపర్తి మావో, దాసరి శ్రీనివాసులు, అనితాస్వాతి, పాలేపోగు డగ్లస్, శిఖకొల్లి సుబ్బారావు, పులికొండ శ్రీనివాసరావు కనగండ్ల సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *