గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి పనుల వివరాలను సిబ్బంది ప్రతిరోజు టెలిగ్రామ్ యాప్ లో నమోదు చేయాలని ఉపాధి ఏపీఓ కె కొండయ్య అన్నారు. స్థానిక ఉపాధి కార్యాలయంలో గురువారం టెక్నికల్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనుల క్షేత్ర పర్యటనకు సంబంధించి జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఏపీవో, ఈసీ, టి ఏ, ఫీల్డ్ అసిస్టెంట్లు ఉదయాన్నే 7.30గంటల నుండి 10 గంటల వరకు మండలంలో ఏదో ఒక గ్రామంలో పనులు జరుగుతున్న ప్రదేశాలకు వెళ్లి ఆ పనుల వివరాలను టెలిగ్రామ్ యాప్ లో నమోదు చేయాలన్నారు. పనుల వద్ద కూలీలకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా చూడాలన్నారు. కూలీల మస్టర్లలో అవకతవకలు జరిగితే సహించేది లేదన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన కొలతల ప్రకారం పనులు చేయించాలన్నారు . ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్లు, జి అశోక్, జి మాలకొండా రెడ్డి, జి నాగరాజు, ఆర్ సుధాకర్, టీ షాలెం, జి రూతమ్మ, తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి పనులను టెలిగ్రామ్ యాప్ లో నమోదు చేయాలి
16
Mar