ఆంధ్ర రాష్ట్రం సాధన కొరకు అమర నిరహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములుకు తాళ్లూరు మండల ప్రజా ప్రతినిథులు ఘనంగా నివాళులు అర్పించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి, వైద్యశాల వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డిలు మాట్లాడుతూ…. “పొట్టి శ్రీరాములు వంటి కార్యదీక్షా పరులు పది మంది ఉంటే ఒక్క సంవత్సరంలోనే స్వతంత్ర్య సంపాదించవచ్చని మహాత్మాగాంధీ అన్న మాటలు ఆయన కార్యదీక్షకు దర్పరణం పడతాయని వివరించారు. ఎంఈఓ జి. సుబ్బయ్య ఆయన సేవలను గుర్తు చేసారు. కార్యక్రమంలో తాళ్లూరు, మల్కాపురం సర్పంచిలు మేకల చార్లెస్ సర్జన్, వలి, కోఆప్షన్మెంబర్ కరిముల్లా, ఎస్ఓ వజ్జా శ్రీనివాసరావు. ఈఓఆర్డీ ప్రసన్నకుమార్, సొసైటీ చైర్మన్ శనివారపు శ్రీనివాస రెడ్డి, కోటయ్య తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో తాళ్లూరు పీహెచ్సీ వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సంఘ బాధ్యుడు రవి, శ్రీను, కోటేశ్వరరావు, రిటైర్డు హెచ్ఎం అంజి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

