పేదల అభ్యున్నతికి మరోసారి అధికంగా బడ్జెట్ లో కేటాయింపులు చేసి నిజమైన పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలిచారని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ పేర్కొన్నారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్ పై ఆయన గురువారం జర్నలిస్ట్ డిజిటల్ మీడియా తో ఫోన్లో మాట్లాడారు. ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి మాట్లాడుతూ ….. 2023-24 రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూ. 2,79,279 కోట్లలో అధికంగా సంక్షేమ పథకాలు, నవరత్నాలతో పాటు బీసీలకు రూ. 22,275 కోట్లు, కాపులకు రూ.4,887 కోట్లు, ఈబీసీలకు రూ. 6,165 కోట్లు, ఎస్సీలకు 8,384 కోట్లు, ఎస్టీలకు రూ. 2,428 కోట్లు, మైనార్టీలకు రూ. 4.203కోట్లు, బ్రహ్మణ కార్పోరేషన్ కు రూ. 346 కోట్లు, క్రిస్టియన్ కార్పోరేషన్ కు రూ. 115 కోట్లు, క్షత్రీయ కార్పోరేషన్ కు రూ.314 కోట్లు, బీసీ కార్పోరేషన్ కు రూ. 6,435 కోట్లు కేటాయించారని చెప్పారు. వ్యవసాయ రంగానికి రూ.11,589 కోట్లు, నీటి పారుదలకు రూ. 11,908 కోట్లు, వైద్య రంగానికి రూ.15.582 కోట్లు, విద్య రంగానికి 31,754 కోట్లు కేటాయించటంతో పాటు అన్ని రంగాలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా నిత్యం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సంక్షేమంతో పాటు అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇచ్చిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గర రాజేంద్ర నాథ్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
పేదల అభ్యున్నతికి పెద్ద పీట – అన్ని రంగాలకు సముచిత స్థానం – పేదరికి నిర్మూలనే ధ్యేయంగా నిత్యం కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతలు – ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్
16
Mar