అకాల వర్షాల సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయాధికారి ప్రసాదరావు కోరారు. పశ్చిమ ద్రోణి, బంగాళ ఖాతం మీదుగా వీచే తూర్పు గాలుల కలయికతో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మండలంలో వరి, మొక్కజొన్న, మిరప కోతలు ముమ్మరంగా సాగుతున్నాయని పలు చోట్ల కలాల్లో ఆరబోసి ఉన్నారని అన్నారు. పంట ఉత్పత్తులను జాగ్రత్తగా కాపాడుకోవాలని కోరారు.
అకాల వర్షాలతో రైతులు జాగ్రత్త వహించాలి
16
Mar