జెపీవీ పథకం విజయవంతానికి కృషి చెయ్యాలి – జిల్లా డిఆర్డీఏ పీడీ బి. బాబు రావు

జగనన్న పాల వెల్లువ పథకం విజయవంతానికి గ్రామైఖ్య పొదుపు సంఘ సభ్యులు (విఓఏ) కృషి చెయ్యాలని డిఆర్డీఏ పీడీ బి. బాబు రావు అన్నారు. వైఎస్సార్ క్రాంతి పథం కార్యాలయంలో శుక్రవారం విఓఏ సంఘ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ (పీడి) బాబు రావు మాట్లాడుతూ… గ్రామాలలో వలంటీర్లు, సొసైటీ ప్రమోటర్లు, మిల్క్ బూత్ సెక్రటరీలు, పొదుపు సంఘ సభ్యులు తప్పనిసరిగా జెపీవీ కేంద్రాలలో పాలు పోసేలా చూడాలని కోరారు. ఎంపీడీఓ కెవై కీర్తి మాట్లాడుతూ … జెపీవీ కేంద్రాలలో పాలు పోయ్యకుండా, సహకరించని వలంటీర్ల నంబర్లు తమకు తెలిపాలని, ప్రతి మిల్క్ బూత్ సెక్రటరీ కూడ బాధ్యతగా పాలను పోస్తూ కేంద్రం అభివృద్ధికి సహకరించాలని కోరారు. శివరామపురం, దారం వారిపాలెం, విఠలాపురం, నాగం బొట్ల పాలెం, తూర్పు గంగవరం, రమణాల వారిపాలెం గ్రామాల వారిగా జెపీవీ కేంద్రాల పురోగతికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. బొద్దికూరపాడు, అయ్యలపాలెం, లక్కవరం, దోసకాయలపాడు, తోట
వెంగన్నపాలెం, బెల్లంకొండవారిపాలెం. మన్నేపల్లి, తురకపాలెం, మల్కాపురం గ్రామాలలో ఈనెల 21లోపు నూతన జెపీవీ కేంద్రాల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎపీఎం దేవరాజ్, పశువైద్యాధికారి ప్రతాప్ కుమార్, స్త్రీ నిధి క్లస్టర్ మేనేజర్ పవన్ కళ్యాణి, సీసీలు సురేంద్రనాథ్, కోటేశ్వరమ్మ, సీఓ వి. కుమారీలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *