ద్రోణి ప్రభావంతో శుక్రవారం తెల్లవారు జాము నుండి తాళ్లూరు మండలంలో వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం వేళ కొంత తెరప ఇవ్వటంతో రైతులు తమ పంటలను కాపాడుకునే పనిలో నిమగ్నమైనారు. మరలా సాయంత్రం వేళ వర్షం కురిసినది. ఓమోస్తరు వర్షాలతో అయితే ఇబ్బందులు ఉండవని, వరుసగా మూడు నాలుగు రోజులు అయితే నష్టాలు తప్పవని రైతులు చెబుతున్నారు. మిరప, గోధుములు, శనగ వంటి ధాన్యపు రాసులను ప్లాస్టిక్ పరదాలతో కప్పి తడువకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
అకాల వర్షంతో రైతన్నలు ఆందోళన
17
Mar