ఫెర్టిలైజర్స్ అన్ని ఇకపై అన్ని రకాల కాంప్లెక్స్, యూరియా ఎరువులు భారత్ బ్రాండ్ పేరుతోనే సరఫరా అవుతాయని వ్యవసాయాధికారి ప్రసాదరావు తెలిపారు.
మల్కాపురం ఆర్బికేలో శుక్రవారం ఎరువులను రైతులకు పంపిణి చేసారు. రైతులు కొన్ని రకాల కంపెనీల ఎరువులు వాడినట్లయితే అధిక ప్రయోజనం ఉంటుదన్న అప నమ్మకంతో ఆ బ్రాండ్ మాత్రమే కావాలని అడుగుతుండటంతో సంబంధిత బ్రాండ్ ను బ్లాక్ చేసి అధిక ధరలకు అమ్ముతున్న విషయాలను గమనించిన ప్రభుత్వం ఇక అన్ని రకాల ఎరువులు భారత్ బ్రాండ్ పేరుతో మాత్రమే వచ్చేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎరువులు బస్తాపై సైతం ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను వివరాలు కూడ ఉంటాయని అన్నారు. కార్యక్రమంలో సర్పంచి వలి, ఎంపీటీసీ ఎం. వెంకట రామిరెడ్డి, విఏఏ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ఎరువులన్నింటికి భారత్ బ్రాండ్
17
Mar