స్వయం స్వయం సహాయక సంఘాలలోని మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది – జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ సంఘాలలోని మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది – జిల్లా కలెక్టర్ శ్రీ ఏ.ఎస్. దినేష్ కుమార్

సున్నా వడ్డీకి రుణాలు మంజూరు చేస్తూ స్వయం సహాయక సంఘాలలోని మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని జిల్లా కలెక్టర్ శ్రీ ఏ.ఎస్. దినేష్ కుమార్ చెప్పారు. ఈ పధకం క్రింద లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో వడ్డీ డబ్బులను జమ చేసేందుకు శుక్రవారం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పాల్గొనగా, దానికి అనుబంధంగా జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ తో పాటు ట్రైనీ కలెక్టర్ శౌర్య పటేల్, జడ్పీ ఛైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మ, పి.డి.సి.సి. బ్యాంకు ఛైర్మన్ శ్రీ వై.ఎం.ప్రసాద్ రెడ్డి, ఒంగోలు నగర మేయర్ శ్రీమతి గంగాడ సుజాత, పలువురు ప్రజా ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులకు బ్యాంకు చెక్కును వారు అందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 49,068 స్వయం సహాయక సంఘాలలోని 4,95,254 మంది లబ్ధిదారులకు ఆర్థిక ప్రయోజనం కలిగినట్లు చెప్పారు. 2019-20 సంవత్సరంలో రూ.80.05 కోట్లు, 2020-21 లో రూ.69.26 కోట్లు, 2021-22 లో రూ.73.29 కోట్లు, 2022-23 లో రూ.65.66 కోట్ల చొప్పున జిల్లాలో ఇప్పటివరకు ఈ నాలుగేళ్లలో రూ.288.26 కోట్లను స్వయం సహాయక సంఘాలకు ప్రయోజనం కల్పించినట్లు వివరించారు. ఈ సంఘాలలోని మహిళలకు ఆర్థిక సాధికారత కల్పిస్తూ వారు చేస్తున్న వ్యాపారాలకు ఊతమిచ్చేలా సున్నా వడ్డీకే రాష్ట్ర ప్రభుత్వం రుణాలు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న ఈ ఆర్థిక సహాయాన్ని జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకునేందుకు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ మహిళలకు అన్ని విషయాలలో అండగా ఉంటూ మహిళా పక్షపాత ప్రభుత్వమని ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తనది నిరూపించుకుంటున్నారని కొనియాడారు. కార్యక్రమంలో మాదిగ కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మూరి కనకారావు, రాష్ట్ర టైలర్ డెవలప్మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ ఛైర్పర్సన్ షేక్ సుభాన్ బి, డి.ఆర్.డి.ఏ. మరియు మెప్మా పి.డి. రవికుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *