పోస్ట్ ఆఫీస్ లో జాతీయ జెండా రూ.25 రూపాయలకే అందుబాటులో ఉన్నది – అవకాశాన్ని వినియోగించుకోవాలి ప్రకాశం జిల్లా తపాలా శాఖ పర్యవేక్షకులు సురేష్

దేశ ప్రజలలో జాతీయతా భావాన్ని, దేశభక్తిని పెంపొందించేందుకు గాను భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘హర్ ఘర్ తిరంగా 2.0’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తపాలా శాఖ జాతీయ జెండా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం ద్వారా తయారైన 30×20″ సైజు కల జాతీయ జెండాలను ఆంధ్రప్రదేశ్ లో ఏ పోస్ట్ ఆఫీసు నుంచైనా కేవలం Rs.25/- నామమాత్రపు చెల్లింపు తో పొందవచ్చు. ఈ సౌకర్యం గ్రామాలలోని బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులలో కూడా కల్పించబడింది. పెద్ద మొత్తంలో జాతీయ జెండాలను కొనుగోలు చేయదలిచినవారు బి వి ఎన్ సురేష్, తపాలా సూపరింటెండెంట్, ప్రకాశం డివిజన్, ఒంగోలు-523001 7989356678, Email : doprakasa.ap@indiapost.gov.in) వారిని కానీ లేదా స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వారిని సంప్రదించవచ్చు. ఈ సేవలను ఉపయోగించుకొని రానున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జాతీయత స్ఫూర్తి ప్రతిబింబించే విధంగా పెద్ద ఎత్తున జరుపుకోవలసిందిగా ప్రకాశం డివిజన్ ప్రజలకు ప్రకాశం జిల్లా తపాలా శాఖ సూపర్ ఇండెంట్ సురేష్ కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *