యువతి పై ఎస్.ఐ. సమందర్ వలి అత్యాచారం – కేసు నమోదు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

(Jsdm- అద్దంకి ప్రతినిధి):

ఇటీవల అద్దంకిలో ఎస్.ఐ. గా విధులు నిర్వహించి వి.ఆర్. కు బదిలీ అయిన ఎస్.ఐ.సమందర్ వలి పై అద్దంకి కి చెందిన ఓ యువతి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు అద్దంకి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది.
ఎస్.ఐ.సమందర్ వలి అద్దంకిలో పని చేస్తున్నప్పుడు, తనని స్నేహపూర్వకముగా ఇంటికి పిలిపించి, తన పుట్టినరోజు పేరుతో మత్తుమందు కలిపిన డ్రింక్స్ తాగించి, తను మత్తులోకి వెళ్లిన తరువాత తనను శారీరకంగా అనుభవించి, ఫోన్ లో వీడియోలు చిత్రీకరించాడని, తనను పెళ్లి చేసుకోవాలని కోరగా, తనను చంపుతానని బెదిరించాడని ఆ యువతి తెలిపింది. అనంతరం ఎస్.ఐ. సమందర్ వలి పై కేసు నమోదు చేసినట్లు అద్దంకి సి.ఐ. రమేష్ బాబు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *