ఎంపిడివోపై నిరసనగా సర్వ సభ్యసమావేశం నుండి బయటికి వెళ్లిపోయిన ఎంపీపీ, జడ్పీటీసీ, సభ్యులు -సర్వసభ్య సమావేశం కన్వినర్, ఎంపీపీ సభ్యులను తీసుకుని వెళ్లి పోవటంతో సభను ముగించిన ఎంపీడీవో -వివాదాలు తలెత్తకుండా ఎస్సై రంగప్రవేశం

ప్రజా ప్రతినిధుల సభలో తమాషాలు చేస్తున్నావు. నీవు వచ్చిననాటి నుండి ఇష్టాను సారం వ్యవహరిస్తున్నావు… మూడు నెలలకు ఒకసారి జరిగే మండల సర్వసభ్య సమావేశానికి గ్రామపంచాయతీ కార్యదర్శులు, విఆర్వోలను పిలవకుండా నిర్వ హించటం వల్ల గ్రామాల్లో సమస్యలు ఎలా పరిష్కరించబడతాయని, ఇలాంటి సమావేశాలు నిర్వహించటం దేనికంటూ  ఎంపీపీ తాటికొండ శ్రీనివా సరావు, జడ్పీటీసీ మారంవెంకటరెడ్డిలు ఎంపీడీవో వై.శ్రీనివాసరావుపై తీవ్ర అగ్రహాం  వ్యక్తం చేస్తూ ఎంపీటీసీలను బయటకు రండంటూ కేకలు వేస్తూ సభ నుండి వెళ్లి పోయారు. స్థానిక మండల పరిషత్ సమావేశం హాలులో ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు అధ్యక్షతన ఎంపీడీవో వై.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మండల సర్వ సభ్య సమావేశం శనివారం జరిగింది. సమావేశం ప్రారంభం కాగానే గృహనిర్మాణ
శాఖ, మంచినీటి సరఫరా శాఖలపై అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో రజానగరం సర్పంచ్ షేక్ కాలేషావలి గ్రామంలో బిల్లుల చెల్లింపులో కార్యదర్శి జాప్యం చేస్తున్నాడని, గృహాలు నిర్మించుకునేందుకు విలేజ్ సర్వేయర్ సహకరించటం లేదని పలు అంశాలను సభ దృష్టికి తీసుక వచ్చారు. పంచాయ తీ కార్యదర్శి లేక పోవటంవల్ల ఎవరిని అడగాలంటూ సర్పంచ్ కాలేషావలి ప్రశ్నించారు.
చారు.
దీంతో ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జడ్పీటీసీ మారం వెంకటరెడ్డిలు సమావేశంకు పంచాయతీ కార్యదర్శులు, విఆర్వోలను ఎందుకు పిలవలేదని ఎం పీడీవోను నిలదీశారు. వారు లేనందున సర్పంచ్ ల కు   సమాధానం ఎవరు చెబుతా రని ప్రశ్నించారు. దీంతో ఎంపీడీవో వై.శ్రీనివాసరావు లేచి సభకు సమాధానం ఇవ్వబోతుండగా ఎంపీపీ ఆగ్రహాంలో కుర్చీలోనుండి లేచి ఏంటీ మీరు సమాధానం ఇచ్చేది మీ ఇష్టారీతిగా చేస్తున్నందున, సభలో తామెందుకంటూ మీరే జరుపుకోండంటూ ఆగ్రహాంతో బయటకు వెళదాం రాండంటూ బయటకు వెళ్లి పోయారు. వెలుతూ తన వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులను వెళ్లి పోదాం రండి సభను వారు నిర్వహించుకుంటారంటూ ఎంపీడీవో పై ఆగ్రహించారు. ఎప్పుడూలేని కొత్త సంప్రదాయాన్ని అమలుచేస్తూ, మీఇష్టానుసారం వ్యవహరిస్తున్నారన్నారు. ప్రశాం తంగా జరిగే సమావేశాలకు పోలీసులు బందోబస్తు పిలవటమేమిటని నిలదీశారు. పదేళ్లకు పైగా తాను జడ్పీటీసీగా వున్నానని, సమావేశాలకు పంచాయతీ కార్యదర్శులను, విఆర్వోలను పిలుస్తూ వుండటం జరుగుతున్నదని, మీరు ఇలా ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. దీనిపై ఎంపీడీవో శ్రీనివాసరావు సమాధానమిస్తూ పంచాయతీ కార్యదర్శులు, విఆర్వోలు నిబంధనల మేరకు మండల పరిషత్ సమావేశా
లకు హజరుకావాల్సిన అవసరంలేదన్నారు. గ్రామపంచాయతీలందు సమస్యలు వుంటే సభ దృష్టికి తీసుక వస్తే వాటన్నింటిని అజెండాలో పొందు పరిచిపరిష్కారం కోసం చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. *సర్వసభ్య సమావేశంలో అలజడి*
సర్వసభ్య సమావేశంలో అలజడిగా గా వుండటంతో ఎస్సై బి.ప్రేమకుమార్ హాలులోకి వచ్చి అరుపులు, కేకలు లేకుండా ప్రశాంత వాతావరణంలో సమావేశం నిర్వహించుకోవాలని ప్రజా ప్రతినిధులకు చెప్పి అలజడిని సర్దుబాటు చేశారు. ప్రశాంతంగా ముందుకు సాగుతున్న సమయంలో ఒక్కసారిగా ఎంపీపీ, జడ్పీటీసీలు సభనుండి వెళ్లి పోదాం రండంటూ పిలుపు ఇవ్వటంతో ప్రజా ప్రతినిధులు ఏమి చేయాలో అర్థం కాక మిన్నకుండి పోగా ఎంపీపీ మరళా లోనికి వచ్చి బయటికి రావాలంటూ పిలవటంతో సభ్యులు వెళ్లిపోయారు. అధికారులు ఈ తంతంగాన్ని చూసి నిచ్చేష్టులయ్యారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఆరు నెలులగా ఒక్క ఇళ్లు మంజూరుకు దిక్కులేదు – అధికారులపై ఎం పీపీ ఆగ్రహాం
ఇళ్లు కట్టుకోవాలని ఆరు నెలలుగా లబ్ధిదారులకు చెబుతున్నామని నేటికి దిక్కులే దని అధికారులు ఏమి చేస్తున్నారని ఎంపీపీతాటికొండ శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
ఇళ్లు మంజూరవుతాయా ? కాదా ? అన్న విషయాన్ని లబ్దిదారులకు స్పష్టతగా చెప్పాలన్నారు. గత మూడేళ్లుగా 787 గృహాలకు 143 పూర్తయ్యాయని హౌసింగ్ అధికారి చెబుతుండగా ఇంక ఎప్పటికి పూర్తవుతాయని ఆగ్రహించారు.
రామభద్రా పురం గ్రామంలోమండల సమావేశం ఉందన్న కారణంంతో  ఆర్. డబ్ల్యూ ఎస్ అధికా రులు మొక్కుబడిగా ట్యాంకు నీరు ఎక్కించారని, మరళా గ్రామంవైపు అధికా రులు కన్నెత్తి చూడరని సర్పంచ్.బి.వెంకటలక్ష్మి సభదృష్టికి తీసుక వచ్చారు. సర్పంచ్ గా   అనేకమార్లు అధికారులకు చెప్పినా, మండల సమావేశాల్లో సభ దృష్టికి తీసుకు వెళ్లినా ఆర్డబ్యుఎస్ అధికారులు తమకేమి  పట్టీ పట్టనట్లు  వ్యవహిస్తున్నారన్నారు.
ప్రసు తం ట్యాంకు నీరు ఎక్కించారని, నిత్యంనీరు నింపేలా చూడాలని కోరారు.  సమావేశంలో వైఎస్ఎంపీపీలు ఐ.వెంకటేశ్వరరెడ్డి,మంచాలప్రియాంక నాగార్జున రెడ్డి, తహసీల్దార్ కెవిప్రసాద్, పంచాయతీరాజ్ డీఈవిఠల్ రాథోడ్, హౌసింగ్, ఆర్ డబ్ల్యుఎస్, విద్యుత్ ఏఈలు కె.కోటిరెడ్డి, శ్రీనివాసరావు, వీరబ్రహ్మం, ఏపివో మురళి, ఏపిఎమ్ దేవరాజ్, ఎంఈవో జి. సుబ్బయ్య , వైద్యాధికారులు షేక్ ఖాదర్ మస్తాన్ బి, మౌనిక, పశువైద్యా ధికారి ప్రతాప్ రెడ్డి, వ్యవసాయాధికారి బిప్రసాద్, పలుశాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *