కోట్లాది రూపాయలు పెట్టి ప్రభుత్వం చక్కటి రోడ్లను వేస్తుంటే వాటిపై మురుగు నీరు, వ్యాపారులు వాడకపు నీరు పారిస్తూ రోడ్లను గుంతల మయం చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. వివరాలలోనికి వెలితే… తాళ్లూరు మండలంలో తాళ్లూరు, తూర్పుగంగవరం ఆర్ అండ్ రోడ్, తూర్పుగంగవరం, చీమకుర్తి రోడ్లలో రోడ్లపైకి మురుగు నీరు పెడుతూ రోడ్ల వెంబడి గుంతల మయం చేస్తున్నారు. దీంతో ఆ రోడ్లలో ప్రయాణిస్తున్న వాహనదారులు, ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు. కోట్లాది రూపాయలు పెట్టి రోడ్లు నిర్మిస్తున్న ఆర్ అండ్ బి శాఖ వాటి నిర్వహణలో మాత్రం మీన మేషాలు లెక్కిస్తున్నారు. దీంతో రోడ్ల వెంబడి ఆక్రమణలకు గురవటమే కాక ఇష్టాను రీతిగా డైనేజిని రోడ్లపైకి వెళ్తున్నారు. చీమకుర్తి ఆర్అండ్ బి రోడ్ లో తేజ డైరీ సమీపంలో ఒక రెస్టారెంట్ నుండి వస్తున్న నీటితో డబుల్ రోడ్ పాడవుతున్నది. అదే విధంగా తాళ్లూరు రోడ్లో కూడ డ్రైనేజి రోడ్ పై కి వస్తుండటంతో నిత్యం గుంతల మయంగా మారుతున్నది. ఇప్పటికైనా పంచాయితీ, ఆర్ అండ్ బి శాఖలు స్పందించి రోడ్ల వెంబడి మురుగు నీటి ప్రవాహాన్ని అరికట్టి రోడ్ల నాణ్యతను కాపాడి, ప్రమాదాలు నివారించాలని వాహనదారులు కోరుతున్నారు.
