వైసీపీలో కష్టించి పనిచేసిన ప్రతి కార్యకర్తకు ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ నాయకత్వంలో న్యాయం జరుగుతుందని వక్తలు అన్నారు. నాగంబొట్లపాలెం సొసైటీ నూతన చైర్మన్ గా యాడిక యలమందా రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. సొసైటీ కార్యాలయం తూర్పు గంగవరంలో చైర్మన్ గా యాడిక యలమందా రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. వైసీపీ తాళ్లూరు మండల ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్ర, ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు మాట్లాడుతూ… పార్టీ స్థాపించిన నాటి నుండి యాడిక యలమందా రెడ్డి పార్టీ కార్యదర్శిగా పార్టీ అభ్యున్నతికి తన వంతుగా కృషి చేసారని అన్నారు. పార్టీలో నిబద్ధతతో పనిచేస్తే పదవులు అవే వస్తాయని అన్నారు. జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్, వైసీపీ తాళ్లూరు మండల ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్రలు యాడిక యలమందా రెడ్డి సేవలు గుర్తించి చైర్మన్ గా అవకాశం కల్పించి ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని మరోసారి నిరూపించారని అన్నారు.
సొసైటీ ద్వారా రైతులకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. చైర్మన్ యాడిక యలమందా రెడ్డి మాట్లాడుతూ… రైతులకు సేవ చేసే అవకాశం కల్పించిన ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్, వైసీపీ ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్రలకు కృతజ్ఞతలు తెలిపారు. తన వంతుగా సన్నచిన్న కారులు రైతుల అభ్యున్నతికి కృషి చేస్తానని అన్నారు. చైర్మన్ గా యాడిక యలమందా రెడ్డి. సొసైటీ మెంబర్లుగా పులి అంజి రెడ్డి, గుజ్జుల బ్రహ్మా రెడ్డిలు బాధ్యతలు స్వీకరించారు. వైసీపీ తాళ్లూరు మండల ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్ర, ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డిలను చైర్మన్ యాడిక యలమందా రెడ్డి ఘనంగా సన్మానించారు. మాజీ ఎఎంసి చైర్మన్ వెన్నపూస వెంకట రెడ్డి (మహేష్), సర్పంచిలు చిమటా సుబ్బారావు, వలి, పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, బి ఎల్ నాగిరెడ్డి, కోఆప్షన్ మెంబర్ కరిముల్లా, మన్నేపల్లి సొసైటీ చైర్మన్ మంచాల వలసా రెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షుడు పులి ప్రసాద్ రెడ్డి, ఉప సర్పంచి కాశి రెడ్డి, మాజీ సర్పంచి పులి క్రిష్ణా రెడ్డి, గుంటి గంగా ఆలయ కమిటీ మాజీ చైర్మన్ | కటకంశెట్టి శ్రీనివాసరావు, అనిల్ కుమార్ రెడ్డి, సయ్యద్ లతీఫ్, కొసనా గురు బ్రహ్మాం. ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు పూనుని దేవదానం, డగ్లస్, బ్రాంచి మెనేజర్ నాగేశ్వరరావు, సీఈఓ శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










