దివంగత ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి సుబ్బా రెడ్డి జయంతి వేడుకలు జిల్లాలో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. చీమకుర్తిలో ఆయన కుటుంబసభ్యులు, ఆయన సతీమణి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని బి. వి. ఎస్ .ఆర్ కళ్యాణ మండపం వద్ద దివంగత ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బా రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్చించారు. కేక్ కట్ చేసి పంపిణీ చేసారు. అనంతరం బూచేపల్లి కమలాకర్ పార్క్ వద్ద దివంగత ఎమ్మెల్యేకు ఘాట్ వద్ద దివంగత ఎమ్మెల్యే సుబ్బా రెడ్డి ఘాటు సుందరంగా అలంకరించి భారీ పూల మాలతో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ శివ ప్రసాద్ రెడ్డిలు నివాళులు అర్పించారు. మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. జవహార్ వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణీ చేస్తారు. ఎస్ విఆర్ దివ్యాంగుల పాఠశాలలో కేక్ ను కట్ చేసి దివ్యాంగులకు” పండ్లు పంపిణీ చేసారు. శివం పౌండేషన్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు రూ. 3లక్షలు విరాళం అందించారు. ఆయా కార్యక్రమాలలో ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ సభ్యుడు వేమా శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ మండల రూరల్ కన్వీనర్ పమిడి వెంకటేశ్వర్లు, పట్టణ కన్వీనర్ క్రిష్టిపాటి శేఖరరెడ్డి, స్థానిక మున్సి పల్ వైస్ చైర్మన్ బాపతు వెంకటరెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచ్ లు, ఎంపీటీసీ సభ్యులు బూచేపల్లి అభిమానులు, వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.








