ప్రకాశం జిల్లా కలెక్టర్ ని మర్యాదపూర్వకముగా కలసిన ప్రకాశం జిల్లా సెర్ప్ ఉద్యోగులజె.ఏ. సీ నాయకులు

ఎంతో కాలముగా పరిష్కారం కొరకు ఎదురు చూస్తున్న 23 శాతం పి. ఆర్. స్ ని రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించి GO.No 64 ను విడుదల చేసిన సందర్భముగా ప్రకాశం జిల్లా డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ రవికుమార్ మరియు సెర్ఫ్ ఉద్యోగుల జేఏసీ నాయకులు ప్రకాశం జిల్లా కలక్టర్ గౌ,, దినేష్ కుమారిని, మరియు జాయింట్ కలేక్టర్ శ్రీనివాసులు కి ధన్యవాదాలు తెలియజేశారు.
ప్రభుత్వ ఉద్యోగుల కొరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రీవెన్స్ లో గతములో ఈ సమస్యను కలక్టర్ గారి దృష్టి కి తీసుకొని వెళ్ళగానే వెంటనే స్పందించి తమ సమస్యలను ప్రభుత్వానికి లేఖ ద్వారా ఫైల్ పంపినందులకు కలక్టర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కలేక్టర్ మరియు జెసి క్యాడర్ వారీగా లబ్ది పొందుతున్న వివరాలు తెలుసుకొని ప్రకాశం జిల్లా ఉద్యోగులందరికి శుభాకాంక్షలు తెలుపుతూ, ఉద్యోగులందరూ మరింత ఉత్సాహముతో పనిచేసి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు పేదలకు అందించుటలో చొరవతో పని చేయాలని కోరారు.
కార్యక్రమములో ఉద్యోగ నాయకులు ఏపిఎం లు , నరేంద్ర, గోపీనాధ్, నారాయణ, కోటేశ్వర రావు, డి.పి.ఎంలు , కృపారావు, సుబ్బారావు, సీసీలు సుధాకర్, రామ కృష్ణ, మోహన్, రామారావు, జయభారతి పాల్గొనారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *