అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటర్లుగా చేర్చాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ బీఎల్ఎలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే టీజే ఆర్ సుధాకర్ బాబు ఆధ్వర్యంలో సోమవారం చీమకుర్తిలోని బూచేపల్లి కల్యాణ మండపంలో చీమకుర్తి, సంతనూతలపాడు మండలాలకు చెందిన బీఎల్ఎ లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమెతో పాటు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి ముఖ్య అతి థులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ …రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకు రావడానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ బీఎల్ఎలు సైనికుల్లా పనిచేయాలని, ఓటర్లను చేర్చించటంలో స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి పార్టీ నాయకులు, బీఎల్ఎలు శ్రద్ధ వహించలన్నారు. పార్టీ శ్రేణులు బీఎల్ఎలకుసహకరించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి, నియోజకవర్గం పరిశీలకులుగా నియమితులైన భవనం శ్రీనివాసరెడ్డి ఓటర్లను చేర్పించటంలో చురుకుగా పనిచేయాల న్నారు. నాలుగు మండలాల వైఎస్సార్ సీపీ నాయకులు, ఎంపీపీ, జెడ్ఫీటీసీలు, పార్టీ మండలాల కన్వీన ర్లు, సర్పంచ్లు, బీఎల్ఎలు పాల్గొన్నారు.
రాబోయే ఎన్నికల్లో బూత్ లెవల్ ఏజెంట్ కీలకంగా వ్యవహరించనున్నారని సంతనూత లపాడు శాసన సభ్యుడు టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. సోమవారం మద్దిపాడు మండలంలోని మల్లవరంలో ఆయన ఇంటి వద్ద నాగులుప్పలపాడు, మద్దిపాడు మండలాల సచివాలయ కన్వీనర్లు, గృహ సార థులు, బీఎల్ఎలకు ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. గ్రామాల్లో ఇప్పటికే ఓటర్ లిస్టులు పంపిణీ చేశామని, ఆ లిస్టులో మరణించిన వారిని, నివాసం ఉండని వారిని గుర్తించాలని ఎమ్మెల్యే టీజేఆర్ సూచించారు. ఈ క్రమంలోనే ప్రవాస భార తీయులు ఎవరైనా ఉన్నారా అన్న అంశాలను కూడా పరిశీలించాలని కోరారు. కొత్తగా ఓట్లు నమోదు చేసుకునే విధానం ఓటర్ల లిస్టులో పేర్ల తొలగించే విధానం ఫారం 6,7,8 ఉపయోగించే విధానం ప్రతి బూత్ లెవల్ ఏజెంట్ నేర్చుకుని ఉండాలని, రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని అత్యధిక మెజా రిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరఫున అసుసరించా ల్సిన వ్యూహాలను ఆయన బూత్ లెవల్ ఏజెంట్లతో చర్చించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివా సరెడి సారథ్యంలో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బా రెడ్డి నేతృత్వంలో జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ ఆశీస్సులతో దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి సహకారంతో మళ్లీ సంత నూతలపాడు నియోజకవర్గంలో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి నాయకుడు కృ షి చేయాలని ఎమ్మెల్యే టీజేఆర్ కోరారు. వచ్చే ఎన్ని కల్లో తాను మంచి మెజారిటీలో గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తొలుత సంతనూతలపాడు నియోజకవర్గ పరిశీలకుడు భవనం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ… రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధి స్తుందని స్పష్టమైపోయిందన్నారు. దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ మరోమారు వలంటీర్లను తూలనాడడాన్ని ఆయన తప్పుబట్టారు. దండుపాళ్యం బ్యాచ్ ఎవరిదో ప్రజలకు పూర్తిగా అర్ధమైపోయిందని, పుంగనూరు ఘటనతో తేటతెల్లమైందన్నారు. చంద్ర బాబు దత్తపుత్రుడు సీఎం ఐపాతానంటూ పగటి కలలు కంటున్నాడని విమర్శించారు. ఎంపీపీ వాకా అరుణ కోటిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ మారెళ్ల బంగారు బాబు, ఏఎంసీ మాజీ చైర్మన్ ఇనగంటి పిచ్చిరెడ్డి, భారత పొగాకు బోర్డు సభ్యుడు మారెడ్డి సుబ్బారెడ్డి,మండల పార్టీ కన్వీనర్లు మండవ అప్పారావు, పోలవరపు శ్రీమన్నారాయణ, జెడ్పీటీసీ సభ్యులు తేళ్ల భాగ్యలక్ష్మి పుల్లారావు, డైరెక్టర్లు కొలకలూరి విజయ్ కుమార్, పేరం చెన్నకేశవులు, సొసైటీల అధ్యక్షులు హనుమయ్య, గట్టినేని అయ్యన్న, సీనియర్ నాయకులు త్రినాథ్ రెడ్డి. రెండు మండలా లకు చెందిన పలువురు పార్టీ సీనియర్ నాయకులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు, పార్టీ కార్యకర్తలు, గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు.
బూచేపల్లి సుబ్బారెడ్డి ఆదర్శప్రాయుడు…
అన్నదాత, సేవా నిరతి కలిగిన దివంగత ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి ఆదర్శప్రాయుడని ఎమ్మెల్యే టీజేఆర్ కొనియాడారు. ఆయన ఆశయాలను జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెం కాయమ్మ, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలు కొనసాగిస్తు న్నారని పేర్కొన్నారు. బూచేపల్లి సుబ్బారెడ్డి జయంతి సంద ర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం నియోజకవర్గ పరిశీలకుడు భవనం శ్రీనివాసరెడ్డిని ఘనంగా సన్మా నించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టీజేఆర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని, తద్వారా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరణాలని కోరారు.




