ఎబీసీ హైస్కూల్లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు – దేశ ప్రగతికి కృషి చేద్దాం – ప్రతి విద్యార్థి లక్ష్యంతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి – ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహణ

ప్రకాశం జిల్లా దర్శి నియోజక వర్గం, తాళ్లూరు మండలంలో తాళ్లూరులోని ఎబీసీ ఉన్నత పాఠశాలలో మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వరరావు జెండాను ఎగుర వేసారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ టి, శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ …జాతీయ సమగ్రత, స్వాతంత్య్ర స్ఫూర్తిని కాపాడుతూ …ప్రతి పౌరుడు దేశ ప్రగతికి కృషి చెయ్యాలని కోరారు. నాడు స్వరాజ్య సాధనకు కృషి చేసారని, నేడు సురాజ్య సాధనకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని కోరారు. ప్రధానోపాధ్యాయుడు కె. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ స్వాతంత్య్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకోవాలని అన్నారు. ప్రతి విద్యార్థి చిననాటి నుండి లక్ష్యాలను ఏర్పరుచుకుని సాధనతో కృషి చేసి ఉన్నత లక్ష్యాలు చేరాలని కోరారు. డైరెక్టర్ కాలేషాబాబు మాట్లాడుతూ …స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గౌరవించి వారి ఆశయ సాధనకు కృషి చెయ్యాలని అన్నారు. బద్ధకంను జయిస్తే విజయం సులభతరం అవుతుందని అన్నారు. ‘కరస్పాండెంట్ టి. శ్రీనివాసరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు కె. వెంకటేశ్వర రావు, డైరెక్టర్ కె. కాలేషాబాబుల ఆధ్వర్యంలో మహాత్ముల చిత్ర పటాలకు ఉపాధ్యాయులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. స్వాంతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీలలో విజేతలైన వారికి బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు (ఎస్.ఏ)లు యలమందారావు, చిన్నయ్య, సుబ్బయ్య, కొండల రావు, వెంకటరావు, స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *