ఘనంగా పంద్రాగస్టు వేడుకలు నిర్వహణ – బాపూజీకి ఘన నివాళి

తాళ్లూరు మండలంలోని పలు ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పాఠశాలలో కార్యాలయాలలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, తాళ్లూరు-1, తాళ్లూరు – 2 సచివాలయాల వద్ద సర్పంచిలు, ఎఓ వజ్జా శ్రీనివాసరావు, తహసీల్దార్ కార్యాలయాల ఆవరణలలో తహసీల్దార్ ప్రసాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎఎస్సై మోహనరావు. ఎం ఆర్ సి వద్ద ఎంఈఓ జి. సుబ్బయ్య, పీహెచ్సీలో వైద్యాధికారి షేక్ ఖాదర్ మస్తాన్ బి, వ్యవసాయశాఖ కార్యాలయం వద్ద ఎవో ప్రసాదరావు, జెండాను ఎగుర వేసారు. స్వాత్రంత్యదినోత్సవ సందేశాలను వక్తలు అందించారు వైస్ ఎంపీపీ ఐ. వెంకటేశ్వరరెడ్డి, తాళ్లూరు సర్పంచి మేకల చార్లెస్ సర్జన్, ఎంపీటీసీలు యామర్తి ప్రభుదాస్, జీఎస్ ప్రభాకర్ రెడ్డి, సర్పంచిలు పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, కోఆప్షన్ మెంబర్ కరిముల్లా, విష్ణు, ఎపీఓ మురళి, ఈఓఆర్డీ కెజీఎస్ రాజు, అన్ని శాఖల అధికారులు మండలంలోని అన్ని పంచాయితీలలో సచివాలయాలలో ఆయా గ్రామాల సర్పంచిల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ నిర్వహించారు. ప్రాముఖ్యతను వివరించారు. తాళ్లూరులో శ్రీ సరస్వతి హైస్కూల్లో విద్యాసంస్థల చైర్మన్ ఏవీ రమణా రెడ్డి, ఎటీసీ హైస్కూల్లో కరస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి ,ప్రధానోపాధ్యాయుడు కె. వెంకటేశ్వరరారావు, డైరెక్టర్ కాలేష బాబు, గీతాంజలి, జాహ్నవి, గంగ, శారద, అమెరికన్ పాఠశాలలో ఆయా పాఠశాలలప్రధానోపాధ్యాయులు జెండాను ఎగుర వేసి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *