తాళ్లూరు మండలం లో పలు పంచాయితీలలో పంద్రాగస్టు వేడుకలు

తాళ్లూరు మండలంలోని అన్ని సచివాలయాల పరిధిలో మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాళ్లూరు సచివాలయంలో సర్పంచి మేకల చార్లెస్ సర్జన్, మల్కాపురంలో సర్పంచి వలి, విఠలాపురంలో సర్పంచిల సంఘం మండల అధ్యక్షుడు, గ్రామ సర్పంచి మారం ఇంద్రసేనా రెడ్డి. తూర్పు గంగవరంలో చాట్ల నాగమణి, బెల్లంకొండ వారి పాలెంలో పోశం సుమలత శ్రీకాంత్ రెడ్డి, బొద్దికూరపాడులో సర్పంచి మందా శ్యామ్సన్, వెలుగు వారిపాలెంలో సర్పంచి కోటేశ్వరమ్మ, నాగంబొట్లపాలెంలో సర్పంచి చిమటా సుబ్బారావు, దోసకాయలపాడులో సర్పంచి కోటశివలక్ష్మి, మన్నేపల్లిలో సర్పంచి వెంకటేశ్వర రెడ్డి, లక్కవరంలో సర్పంచి వరలక్ష్మి, రామభద్రాపురంలో సర్పంచి బాపిరెడ్డి వెంకట లక్ష్మి, శివరామపురం సర్పంచి బొడ్డు రాములు, మాధవరం సర్పంచి తాటికొండ రేణుక, తురకపాలెంలో సర్పంచి చంద్రగిరి గురువా రెడ్డిలు జెండా ఎగురవేసారు. స్వాతంత్య్ర దినోత్సవ సందేశం అందించారు. ఆయా కార్యక్రమాలలో ఎంపీటీసీలు, గ్రామకార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *