దర్శి మండలంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రెవెన్యూ కార్యాలయం మోడల్ స్కూల్లో ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగో పాల్ జాతీయ జెండాను ఎగురవేశారు. సీనియర్ సివిల్ జడ్జి జీఎల్వీ ప్రసాద్ కోర్టు ప్రాంగణంలో జాతీయ జెండా ఎగురవేశారు. జాతీయ నేతలకు నివాళులర్పించారు. పోలీస్ స్టేషన్లో ఏఎస్సై రామకృష్ణ, కృషి విజ్ఞానకేంద్రంలో డాక్టర్ ఎం ఉషా, దర్శి ఎంపీపీ స్కూల్, కేజీబీవీ, ప్రభుత్వ పాఠశాలల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. మోడల్ స్కూలులో విద్యార్థుల ప్రదర్శనలు అల రించాయి. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. మోడల్ స్కూలులో విద్యార్థులకు నీటి సౌకర్యం కోసం బోరును ఎమ్మెల్యే ప్రారంభించారు. మోడల్ స్కూల్ను తనిఖీ చేసి వారికి కావాల్సిన సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. ఒక్కరోజులోనే పాఠశాలలోప లికి వేసిన సిమెంట్ రోడ్డును ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రారంభించి దాతలు జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి, జెసిఎస్ కన్వీనర్ బత్తినేని వెంకటేశ్వర్లు, షేక్ అమీన్ భాషా, జెసిఎస్ కన్వీనర్ ఎదురు కోటి రెడ్డి, గోపు ఎర్రయ్యలను సత్కరించారు. ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ ఎందరో తమ ప్రాణాలను పణంగా పెట్టి సాధిం చిన స్వాతంత్ర్యాన్ని మనం అనుభవిస్తున్నామ న్నారు. ఎంపీపీ సుధా అచ్చయ్య,మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి మహేష్), రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అం జిరెడ్డి, రెడ్డి సంక్షేమసంఘం జిల్లా అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి, సర్పంచ్ల సంఘ అధ్యక్షుడు కేసరి రాంభూపాల్ రెడ్డి, సర్పంచ్లు రాము, సుబ్బా రెడ్డి, ప్రిన్సిపాల్ హసీనాబాను తదితరులు పాల్గొన్నారు.






