దర్శి మోడల్ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాను అని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. పాఠశాలలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. విద్యార్థులకు నీటి సౌకర్యం కోసం బోరును ఎమ్మెల్యే ప్రారంభించారు. మోడల్ స్కూల్ ను తనిఖీ చేసి వారికి కావాల్సిన సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. ఒక్కరోజులోనే పాఠశాలలోప లికి వేసిన సిమెంట్ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించి దాతలు జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి, జెసిఎస్ కన్వీనర్ బత్తినేని వెంకటేశ్వర్లు, షేక్ అమీన్ భాషా, జెసిఎస్ కన్వీనర్ ఎదురు కోటి రెడ్డి, గోపు ఎర్రయ్యలను సత్కరించారు. ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ ….ఎందరో తమ ప్రాణాలను పణంగా పెట్టి సాధిం చిన స్వాతంత్ర్యాన్ని మనం అనుభవిస్తున్నామన్నారు. ఎంపీపీ సుధా అచ్చయ్య, మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అం జిరెడ్డి, రెడ్డి సంక్షేమసంఘం జిల్లా అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి, సర్పంచ్ ల సంఘ అధ్యక్షుడు కేసరి రాంభూపాల్ రెడ్డి, సర్పంచ్లు రాము, సుబ్బా రెడ్డి, ప్రిన్సిపాల్ హసీనాబాను పాల్గొన్నారు.

