వైద్యశాల అభివృద్ధి జరిగితే అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. వైద్యశాలలో అభివృద్ధి పై ఎమ్మెల్యే సమీక్షా సమావేశం
నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ… ఆస్ప త్రిలో చిల్లచెట్లు తొలగించి మట్టి తోలి మంచి మొక్కలు నాటుతామన్నారు. ఆసుపత్రిని ఆహ్లాదంగా ఉంచుతామని చెప్పారు. అందుకు వైఎస్సార్ సీపీ నాయకులు కూడా తమ సహాయ సహకారాలు అందిస్తున్నారని అందుకు వారిని అభినందిస్తున్నట్లు తెలిపారు. డీఈ కరీం, కమిషనర్ మహేష్ తో చర్చించి ప్రతిపాదనల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంపీపీ గొల్లపాటి సుధా అచ్చయ్య , మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి, రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటీఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి, కౌన్సిలర్లు వి.సి రెడ్డి ,మోహన్ రెడ్డి, మండల సచివాలయ కన్వీనర్లు వెంకటేశ్వర్లు, కోటిరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దేవప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.




