ముండ్లమూరు మండలంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహణ -ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితమే స్వాతంత్ర్యము

ఎందరో మహానుభావుల త్యాగాల వలన దేశానికి స్వాతంత్రం వచ్చిందని, స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న మహనీయుల జీవితం ద్వారా స్ఫూర్తి పొందాలని తహసిల్దార్ మహమ్మద్ నయీమ్ అహ్మద్ అన్నారు.76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం జాతీయ జెండాను ఆవిష్క రించి జండా వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యము రావడంతో భారతదేశం అనేక విధాలుగా అభివృద్ధి చెందిందన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు నాయకులత్యాగాల గురించి తెలుసుకొని దేశభక్తిని పెంపొందించుకోవాలన్నారు. ఎందరో మహానుభావుల పోరాటం త్యాగం కృషి ఫలితంగా భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రాన్ని సిద్ధం చేసుకోవడం జరిగిందన్నారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ జి పుల్లారెడ్డి, సర్వే ల్యాండ్ డిప్యూటీ తహసిల్దార్ ఏ స్రవంతి, సీనియర్ అసిస్టెంట్ పోగుల శేషగిరిరావు, వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *