విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలని మండల టిడిపి అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు అన్నారు. ముండ్లమూరు మండలం లోని శంకరాపురం ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ఆ పాఠశాల చైర్మన్ మందలపు శ్రీనివాసరావు అధ్యక్షతన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కూరపాటి శ్రీనివాసరావు ఆ పాఠశాలకు రూ.10,000 విలువ గల మైక్ సెట్ ను అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచి కూరపాటి మహేశ్వరి నారాయణస్వామి హాజరైనారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి చదువుతోపాటు క్రమశిక్షణ అలవచుకుంటే ఉన్నత స్థాయికి ఎదిగేందుకు దోహదపడుతుందన్నారు. చదువుతోపాటు ఆటలలో రాణించాలని కోరారు. భవిష్యత్తులో పాఠశాలకు విద్యా భివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి మన పాఠశాలకు మన గ్రామానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు ఎన్ అరుణ కుమారి, మాజీ ఎంపీపీ మందలపు వెంకటరావు, మేదరమెట్ల కోదండ రామయ్య, ఉపాధ్యాయులు బిరుదు రాజు వెంకట సుబ్బరాజు, తదితరులు పాల్గొన్నారు.
