ప్రజల స్వేచ్ఛ జీవితానికి పోరాటం చేసిన మహనీయులు ఎందరో అని వారిని ఎల్లప్పుడూ నిరంతరం గుర్తుంచుకోవాలని సర్పంచ్ వరగాని బాల సుందర రావు అన్నారు. ముండ్లమూరు మండలంలోని పసుపుగల్లు ఎస్సీ కాలనీ లో గల ప్రాథమిక పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నేటి బాలలే రేపటి పౌరులని తెలుపుతూ బాల బాలికలు ఉన్నత చదువులు మన దేశ ఉన్నతికి మెట్లు వంటివి అని అన్నారు. ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధులు వారి ప్రాణాలు సైతం లెక్కచేయకుండా బ్రిటిష్ వారితో పోరాడి స్వేచ్ఛను సాధించారని తెలిపారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి జండా వందనం స్వీకరించారు. విద్యార్థిని విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు . ఉపాధ్యాయులు, ఎస్ఎంసి కమిటీ మెంబర్లు , గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
