సమగ్ర శిక్ష అభియాన్ నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ఉత్తమ సైట్ ఇంజనీర్ గా ఏఈగా కోటేశ్వరరావు అవార్డు అందుకున్నారు.
జిల్లా ఇన్చార్జి మంత్రి మేరుగ నాగార్జున, జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, మాజీ మంత్రి బాలినేనీ శ్రీనివాసులు రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ అవార్డు ,ప్రశంసా పత్రం అందుకున్నారు. మంగళవారం ఒంగోలులో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ అవార్డును అందుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి డిఈఓ వి ఎస్ సుబ్బారావు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
