77 వ స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం మన్నేపల్లి ప్రాథమిక సహకార సంఘం నందు పి పి ఎల్ కంపెనీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవం నిర్వహించారు. ముందుగా మార్కెటింగ్ ఆఫీసర్ మాట్లాడుతూ రైతులందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో పిపిఎల్ కంపెనీ ప్రతినిధులుచే జై జవాన్ జై కిసాన్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని సైన్యంలో పనిచేసి వ్యవసాయం చేస్తున్న రైతులని ఘనంగా పూలమాలు శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా రైతులకు పి పి ఎల్ కంపెనీ ప్రతినిధులు పంటలు పండించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు పంటలకు వాడవలసిన పురుగు మందులు మరియు ఎరువులు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనిక్ అధికారులు ఎం. పుల్లయ్య , మన్నేపల్లి సింగిల్ విండో చైర్మన్ మంచాల వలసా రెడ్డి , పి పి ఎల్ కంపెనీ ప్రతినిధులు మార్కెటింగ్ ఆఫీసర్ పి ప్రభాకర్, డిబిటిఎస్ వెంకట్రావు, జే కే ఎస్ లు ప్రసాద్ మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.

