ప్రముఖ ఫెర్టిలైజర్ కంపెనీ పిపిఎల్ వారి ఆధ్వర్యంలో 77 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎన్టీఆర్ జిల్లా
పెనమలూరు మండలం పెనమలూరు శ్రీ విజయ ఏజెన్సీస్ నందు ఘనంగా నిర్వహించినారు. కార్యక్రమంలో ముందుగా కంపెనీ ప్రతినిధి అయిన మార్కెటింగ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎస్ ఎండి రఫీ మాట్లాడుతూ దేశానికి సైనికులు చేస్తున్న సేవలు ఎనలేవని కొనియాడినారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో పి పి ఎల్ కంపెనీ ప్రతినిధులుచే జై జవాన్ జై కిసాన్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని సైన్యంలో పనిచేసి వ్యవసాయం చేస్తున్న రైతులని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రైతుల పంటలు పండించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు పంటలకు వాడాల్సిన ఎరువులు మరియు పురుగు మందుల గురించి కంపెనీ ప్రతినిధులు తెలియజేశారు. ఈకార్యక్రమంలో మార్కెటింగ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎస్ఎండి రఫీ, మిలటరీ ఆఫీసర్స్ దేవేందర్, దేవినేని బోస్, భుజంగరావు, మార్కెటింగ్ ఆఫీసర్స్ ఉదయ్ కుమార్, రవీంద్ర, సేల్స్ ట్రైని బాలాజీ, విజయ ఏజెన్సీస్ ప్రొప్రైటర్ మల్లికార్జునరావు మరియు రైతులు పాల్గొన్నారు.


