కుటుంబ బాధ్యతను మోయాల్సిన కుమారుడు బాధ్యతను మరిచి చెడు వ్యసనాలకు లోనై చివరికి తల్లిదండ్రులను హతమారుస్తున్నా అంటూ నిత్యం వేధిస్తున్న కుమారుడు కుంచాల సుబ్బారావును తండ్రి కుంచాల వెంకటేశ్వర్లు హతమార్చిన ఘటనలో నిందితుడు వెంకటేశ్వర్లను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అందుకు సంబంధించినవివరాలు దర్శి సీఐ జె రామకోటయ్య వివరించారు. పోలీసుల కథనం ప్రకారం చెడు అలవాట్లకు లోనైనా కుంచాల సుబ్బారావు నిత్యం అప్పులు చేస్తూ గ్రామంలోని ప్రజలతో తరచూ గొడవలు పడుతూ తగాదాలు తీసుకువస్తూ కుటుంబ బాధ్యత మరిచి వ్యవహరిస్తున్నాడు. అనేకసార్లు తండ్రి వెంకటేశ్వర్లు మందలించి భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నావంటూ నిలదీసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి ఉండే నివాసాన్ని సైతం తాకట్టు పెట్టేందుకు ప్రయత్నించగా తండ్రి అడ్డుకున్నాడు. కన్నతల్లి అనారోగ్యం పాలై గుంటూరు వైద్యశాలలో చికిత్స పొందుతున్నప్పటికీ పట్టించుకున్న దాఖలాలు లేవు అన్నారు. పైపెచ్చు ఇంటి తాకట్టును అడ్డుకునేందుకు వైద్యశాల నుండి ఇంటికి వచ్చిన వెంటనే తల్లి తండ్రిని చంపుతానంటూ బెదిరించాడు. దీంతో కుమారుడు ప్రవర్తన వలన ఇప్పటికే అస్తవ్యస్తం అవడంతో ఆవేదన చెందిన తండ్రి కుమారుడు నిద్రించుచున్న సమయంలో గొడ్డలితో నరికి చంపి తుద ముట్టించాడు. సుబ్బారావు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు జిల్లా ఎస్పీ మల్లికా ఖర్గో ఆదేశాల మేరకు దర్శి డిఎస్పీ అశోకవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సీఐ జయ రామకోటయ్య సూచనలతో ఎస్సై యు వి కృష్ణయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసి ముద్దాయిని అరెస్టు చేశారు . కేసును త్వరితగతంగా ఛేదించిన సిఐ,ఎస్ఐలను సిబ్బందిని జిల్లా ఎస్పీ మల్లికా గర్కు అభినందించారు.
