వన్ టైం సెటిల్మెంట్ (ఓ. టి. ఏస్ ) గృహ లబ్ధిదారులకు వరం లాంటిదని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగో పాల్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం వన్ టైం సెటిల్మెంట్ పట్టాల పం పిణీ కార్యక్రమం నిర్వహించారు. గృహ నిర్మాణా లకు గతంలో రుణాలు తీసుకున్న 175 మందికి వన్ టైం సెటిల్మెంట్ ద్వారా రుణమాఫీ చేసి ఆ పత్రాలతో పాటు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ …గతంలో రుణాలు తీసుకుని నివాసాలు ఏర్పాటు చేసుకుని ఇబ్బం దులతో ఆ రుణాలు చెల్లించలేని వారికి ఇది మంచి అవకాశమని అన్నారు. ప్రతి లబ్ధిదారుడు సంతోషంగా గృహ రుణమాఫీ పత్రాలు తీసుకుని సీఎం జగనన్నను కీర్తిస్తున్నారని చెప్పారు. ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనకు మించి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు అండగా ఉంటున్నారనడంలో ఎటువం టి సదేహం లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి,రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫి కేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, డీఈ షేక్ షాకీర్ బాషా తదితరులుపాల్గొన్నారు.
