దేశంలో అద్భుత పాలన అందించాలంటే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని ఆదర్శంగా తీసుకోవాలనే విధంగా సీఎం పాలన అందిస్తు న్నారని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. దర్శి లో 20వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం బుధవారం జరిగిం ది. ఈ సందర్భంగా గడప గడపకు తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రేషన్ బియ్యం బండ్లు కొన్ని ప్రాంతాలకు రావడం లేదని, నివాసాలు మంజూరుకు, పింఛన్ల మంజూరుకు ఆన్లైన్ అడ్డంకులు తొలింగించి పథ కాలు అందజేయాలని, కుల ధ్రువీకరణ, విద్యుత్ స్తంభాలు, సీసీ రోడ్లు వేయించాలని విజ్ఞప్తులు వచ్చాయి. వాటన్నింటినీ వెంటనే పరి ష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదే శాలు జారీ చేశారు. శాలువాలు, పూలమా లలతో హారతులిచ్చి ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ ….ఇంటింటికీ వెళ్లినప్పుడు వలంటీర్ల సేవలు బాగా అందిస్తున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. గతంలో ఏ పథకం కావాలన్నా తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాల యాల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, తిరిగి తిరిగి విసిగి వేశారేవారమని మహిళలు తమ ఆవేదనవెళ్లబుచ్చినట్లు చెప్పారు. సీఎం చెప్పారంటే చేస్తారనే నమ్మకం ప్రజల్లో వచ్చిందన్నారు. తన వల్ల లబ్ధి చేకూరితేనే ఓటేయండని అడిగే దమ్మున్న నాయకుడు ఒక్క సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని స్పష్టం చేశారు. ఎన్ని పార్టీలు కట్టకట్టుకుని వచ్చినా వైఎస్సార్ సీపీ గెలుపునల్లేరు మీద నడకేనన్నారు. సీఎం ప్రవేశ పెట్టిన నవరత్నాలు పేదల పాలిట వరాలుగా మారాయని సూచించారు. కరోనా కష్ట కాలంలో ప్రభుత్వ పథకాలే పేద ప్రజలకు అండగా ఉన్నాయన్నారు. ఎటువంటి అవినీతికి తావు లేకుండా మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహ న్ రెడ్డి అని కాలర్ ఎగరేసి చెప్పుకునే విధంగా పాలన కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ చెప్పారు. మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి (మహేష్), రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, వార్డు ఇన్చార్జ్ కర్ణా భాస్కర్ రెడ్డి, జిల్లా రెడ్డి సంక్షేమ సంఘ జిల్లా అధ్య క్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి, కౌన్సిలర్లు మేడం మోహన్ రెడ్డి, వీన్ రెడ్డి, తాళ్లూరి బాబూ రావు, జగన్నాథం మోహన్ బాబు, నాయకులు మిల్లర్ బుజి, కుంటా అచ్చయ్య, గంజి వెంకటేశ్వరరెడ్డి, ఖాళీం బ్రదర్స్, శ్రీనివాసరెడ్డి, వెంకటే శ్వరరెడ్డి, మజ్ను వలి, రహమాన్ పాల్గొన్నారు.
*చింతలపాలెంలో…..*
సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని
ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. దర్శి నగర పంచాయతీ పరిధి చింతలపాలెంలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం బుధ వారం సాయంత్రం జరిగింది. దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ… పార్టీలకు తీతంగా అందరికీ సంక్షేమం,అభివృద్ధి కార్యక్ర మాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమ న్నారు. మండల పార్టీ కన్వీనర్ వెన్నపూస వెంక టరెడ్డి,(మహేష్), రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, వార్డు ఇన్చార్జ్ కర్ణా భాస్కర్, రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు వేమిరెడ్డి చెన్నారెడ్డి, జేసీఎస్ కన్వీనర్లు ‘బత్తినేని వెంకటేశ్వర్లు,ఎదురు కోటిరెడ్డి, కౌన్సిలర్ వీసీరెడ్డి, నాయ కులు అంబటి వెంకటేశ్వరరెడ్డి, మిల్లర్ బుజ్జి సొసైటీ గంజి వెంకటేశ్వరరెడ్డి, గోపు ఎర్రయ్య, ఖాసీం బ్రదర్స్, అంకాల శ్రీను, యాదాల వెంక టేశ్వర్లు పాల్గొన్నారు.


